‘అఖండ’ ట్రైలర్ రిలీజ్

‘అఖండ’ ట్రైలర్ రిలీజ్

బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘అఖండ’ సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది. డిసెంబర్ 2న థియేటరర్లలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. బోయపాటి-బాలయ్య కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ సినిమాలు బాక్సాఫీసును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ లో మైలురాళ్లుగా చెప్పుకోదగ్గ సినిమాల సరసన ఈ రెండు సినిమాలు నిలిచాయంటే అతిశయోక్తి కాదేమో. ముఖ్యంగా బాలకృష్ణ కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లో పీక్ కు చేరేలా బోయపాటి తీశారన్న ప్రశంసల నేపధ్యంలో వీరి కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని.. గతంలో ఎన్నడూ చేయని అఘోరా పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నట్లు తెలియడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలకృష్ణ గెటప్ అభిమానులతోపాటు చిత్రపరిశ్రమలో కూడా హాట్ టాపిక్ గా నిలిచింది.   
బాలకృష్ణ అభిమానులే కాదు.. అందరూ కోరుకునే అన్ని హంగులతో ట్రైలర్ ఆకట్టుకునేలా తీసినట్లు ట్రైలర్ చూస్తే  అర్థమవుతుంది. ముఖ్యంగా బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఊరించే ప్రయత్నం చేశారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రెడీ అయిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌లో మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించారు. తమన్‌ మ్యూజిక్‌ అందించిన ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా.. జగపతి బాబుతోపాటు శ్రీకాంత్ కీలకపాత్రల్లో నటించారు. ఇంకెందుకు ఆలస్యం..  ట్రైలర్ చూసేయండి మరి.