అమర్త్యసేన్ బతికే ఉన్నారు : కూతురు క్లారిటీ

అమర్త్యసేన్ బతికే ఉన్నారు : కూతురు క్లారిటీ

ప్రముఖ అర్థిక వేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ మరణించరంటూ వస్తున్న వార్తలపై   ఆయన కుమార్తె నందనా దేబ్‌ సేన్‌  స్పందించారు. తన తండ్రి ఆయన క్షేమంగానే ఉన్నట్లుగా  తెలిపారు.  " ఈ పుకార్లన్నింటినీ స్ప్రెడ్ చేయడం మానేయాలని కోరుతున్నాను. నాన్న బాగానే ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నారు నిన్న (సోమవారం) రాత్రి వరకు నేను అతనితోనే ఉన్నాను.. ప్రస్తుతం ఆయన  కొత్త పుస్తకంతో బిజీగా ఉన్నారు. " అంటూ తెలిపారు.  కాగా  అమర్త్యసేన్‌ మరణించారంటూ సోషల్‌ మీడియాల్లో వార్తలొచ్చిన విషయం తెలిసిందే.   

1933 నవంబర్ 3న బెంగాల్‌లోని శాంతినికేతన్లో జన్మించిన అమర్త్య సేన్ .ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త.  పొలిటికల్ లిబరలిజం లలో చేసిన విశేష కృషికి గానూ 1998 లో నోబెల్ బహుమతి లభించింది.1999లో భారతరత్న పురస్కారం లభించింది.  

ఇక  నందనా సేన్ బాలీవుడ్ నటి.  బాలీవుడ్‌లో ఆమె మొదటి సినిమా సంజయ్ లీలా బన్సాలీ బ్లాక్ (2005). ఈ చిత్రంలో రాణి ముఖర్జీ, అమితాబ్ బచ్చన్ లతో కలిసి ఆమె నటించింది. ఆమెది రాణి ముఖర్జీకి చెల్లెలి పాత్ర. రామ్ గోపాల్ వర్మ, కేతన్ మెహతాతో సహా ఇండియన్ టాప్ డైరక్టర్ లతో కలిసి పని చేసింది.  నందనా సేన్ 2013 జూన్ లో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఛైర్మన్ జాన్ మాకిన్‌సన్‌ను వివాహం చేసుకుంది. ఈ జంట 2018లో ఒక యువ బెంగాలీ అమ్మాయిని దత్తత తీసుకున్నారు.