Nani-Srikanth Odela: దసరా డైరెక్టర్ నెక్స్ట్ చిరంజీవితో కాదట..మళ్ళీ నానితోనే వస్తున్నాడట!

Nani-Srikanth Odela: దసరా డైరెక్టర్ నెక్స్ట్ చిరంజీవితో కాదట..మళ్ళీ నానితోనే వస్తున్నాడట!

నేచురల్ స్టార్ నాని (Nani)తో దసరా (Dasara) లాంటి రా అండ్ రస్టిక్ మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth odela). మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకొని బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టాడు ఈ కుర్ర దర్శకుడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు.

అప్పటినుండి ఈ దర్శకుడు తన రెండో  సినిమాను ఏ స్టార్ తో చేయనున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు శ్రీకాంత్ ఓదెల తన తరువాతి సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక అదిరిపోయే స్టోరీ రెడీ చేసినట్లు టాక్ చాలా రోజుల నుంచి వినిపిస్తూ వచ్చింది.అంతేకాదు ఈ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథకు చిరు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలిసింది. కానీ,శ్రీకాంత్ ప్రస్తుతం దసరా 2 ప్రాజెక్ట్ పైనే ఫోకస్ పెట్టినట్లు సమాచారం.  

దసరా మూవీ చివర్లో చూపించిన దానికి కంటిన్యూగా తెరకెక్కించున్నారు. ఏడేళ్ల జైలు శిక్ష తర్వాత ధరణి (నాని) అండ్ కో ఊరిలో అడుగుపెట్టి ఇంకా తాగుడు వల్ల ఊరి కుర్ర కారు ఇబ్బంది పడుతున్నారని తెలిసి అక్కడ ఉన్న బార్ ని తగలబెడతాడు. ఇక ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరగబోతుంది? రెండో భాగంలో ఎటువంటి కథ చూపెట్టబోతున్నాడు?అనేది తెలియాల్సి ఉంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.