తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి

 తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.  భువనేశ్వరితో పాటు టీడీపీ  ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్‌, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి కూడా  శ్రీవారిని దర్శించుకున్నారు.  దర్శనం  అనంతరం అర్చకులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనతంరం ఆమె  నారావారిపల్లెకు బయలుదేరారు.  

ఇక రేపటి నుంచి  నారా భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు.  నారావారిపల్లె నుంచి యాత్ర మొదలుకానుంది.  నిజం గెలవాలి అనే పేరిట ఆమె ఈ యాత్రను చేపట్టనున్నారు.  చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో  చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు.  నిజం గెలవాలి యాత్ర ద్వారా ఇంటింటికి వెళ్లి మృతుల కుటుంబాలను ఓదార్చి భరోసా ఇస్తారు.  అంతేకాకుండా స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లో ఆమె పాల్గొననున్నారు.  

ALSO READ :- Weather : తీవ్ర తుఫాన్ గా హమూన్.. ఏడు రాష్ట్రాలకు భారీ వర్షాలు..