300 కేజీల ఆపిల్స్ దండతో నారా లోకేష్ కు ఘన స్వాగతం

300 కేజీల ఆపిల్స్ దండతో నారా లోకేష్ కు ఘన స్వాగతం

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోకి చేరుకుంది. వీకోట మండలం అన్నవరం గ్రామంలోకి చేరుకున్న నారా లోకేష్ కు.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 300 కేజీల ఆపిల్స్ తో తయారు చేసిన పూలదండతో నారా లోకేష్ కు స్వాగతం పలికారు.  మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మహిళలు అడుగడుగునా హారతులతో స్వాగతం పలికారు.