నారా రోహిత్ హీరోగా నటించబోతున్న కొత్త చిత్రాన్ని బుధవారం ప్రకటించారు. చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భరత్ చౌదరి నిర్మిస్తున్నారు. నారా రోహిత్ కెరీర్‌లో ఇది 23వ సినిమా. ‘షౌటింగ్ సూన్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఉన్న అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేపుతోంది.
రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నామని, యూనివర్సల్ ఎమోషన్స్‌తో కూడిన ఈ మూవీ కాన్సెప్ట్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. త్వరలోనే లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించి.. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.
