నారాయణపేట: దొంగ అరెస్ట్, రూ.6.88 లక్షలు స్వాధీనం

నారాయణపేట: దొంగ అరెస్ట్, రూ.6.88 లక్షలు స్వాధీనం

నారాయణపేట, వెలుగు: తాళాలు వేసి ఉన్న ఇండ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్​ చేసి రూ.6,88,500 స్వాధీనం చేసుకున్నట్లు నారాయణపేట ఎస్పీ డాక్టర్  వినీత్  తెలిపారు. సోమవారం ఎస్పీ ఆఫీస్​లో మీడియాకు వివరాలు వెల్లడించారు. 

గండీడ్​ మండలం లింగయ్యపల్లి గ్రామానికి చెందిన ప్రైవేట్​ బస్​ డ్రైవర్​ ఏదుల బాబును కోస్గిలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితుడి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. 2022 నుంచి 18 చోరీలకు పాల్పడినట్లు చెప్పారు.