
లింగంపేట,వెలుగు: లింగంపేట ఎంపీడీఓగా ఆర్. నరేశ్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. జుక్కల్ నుంచి ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇంతకుముందు లింగంపేట ఎంపీడీఓగా పనిచేసిన మల్లిఖార్జున్‌రెడ్డి రిటైర్ అయ్యారు. ఎంపీపీ గరీబున్నిసా నయీం, పంచాయతీ సెక్రటరీలు నరేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.