బాలీవుడ్లో గ్లామర్ రోల్స్తో పాటు పలు డ్యాన్స్ నంబర్లలోనూ తనదైన స్టైల్ చూపించే నర్గీస్ ఫక్రీ మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. తాజాగా టాలీవుడ్ లో సీనియర్ హీరోతో కలిసి డ్యాన్స్ చేసే క్రేజీ చాన్స్ అందుకుందని తెలుస్తోంది. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం నర్గీస్ పేరు వినిపించడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరపగా, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ ని భారీ స్థాయిలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారట. మేకర్స్ దీని కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేశారట.
శుక్రవారం నుంచి ఈ ఐటెంసాంగ్ ను షూట్ చేయబోతున్నట్లు సమాచారం. బాలకృష్ణ మాస్ స్టెప్పులు, సర్గీస్ గ్లామర్ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న గోపీచంద్ మలినేని, బాలకృష్ణను మరోసారి పవర్ ఫుల్ పాత్రలో చూపించనున్నారని తెలుస్తోంది. 'వీర సింహారెడ్డి' తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న మరో చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
