వరంగల్ జిల్లా నర్సంపేట ఐసీఐసీఐ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ బైరిశెట్టి కార్తీక్ రూ.8.65 కోట్లు కొల్లగొట్టాడు. కొద్దిరోజుల నుంచి బ్యాంకు లావాదేవీల్లో తేడాను గమనించిన పై అధికారులు తనిఖీ చేయగా అసలు విషయం వెలుగు చూసింది. డిప్యూటీ మేనేజర్ కార్తీక్ బ్యాంక్ మెయిన్అకౌంట్నుంచి ట్రాన్స్ఫర్చేసి ఆన్లైన్రమ్మీతోపాటు ఇతర గేమ్‌లు ఆడాడు.
ఫ్రాడ్ చేసిన విషయాన్ని అధికారులు గుర్తించడంతో కార్తీక్ పరారయ్యాడు. దీంతో బ్యాంక్ రీజినల్ హెడ్ ఓరుగంటి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ప్రాథమికంగా 8.65 కోట్లు కార్తీక్ కొలగొట్టినట్లు నిర్ధారించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.