
నల్లబెల్లి, వెలుగు: వరంగల్ జిల్లా నల్లబెల్లి, దుగ్గొండి మండలంలో శుక్రవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించి, మొక్కలు నాటారు. దుగ్గొండి మండలం చాపలబండ, నల్లబెల్లి మండలం కొండాయిలపల్లిలో ఉపాధి పనులలో నిర్మించిన పశువుల పాకలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.