మహిళా ఖైదీ మృతి ఘటనలో నర్సంపేట సబ్ జైలర్ సస్పెన్షన్

మహిళా ఖైదీ మృతి ఘటనలో నర్సంపేట సబ్ జైలర్ సస్పెన్షన్

వరంగల్/ నర్సంపేట, వెలుగు : మహిళా ఖైదీ మృతి ఘటనలో నర్సంపేట సబ్​ జైలర్​లక్ష్మీశృతి సస్పెండ్ అయ్యారు. వరంగల్​ఉమ్మడి జిల్లా సబ్​ జైళ్ల అధికారి పరావస్తు వెంకటేశ్వర స్వామి శనివారం రాత్రి మీడియాకు వివరాలు తెలిపారు. ఈనెల 21న జైలులో మహిళా ఖైదీ పెండ్యాల సుచరిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మృతిపై శనివారం ‘వీ6 వెలుగు’ లో ‘ మహిళా ఖైదీ మృతి ఘటనలో ట్విస్ట్!’  పేరిట న్యూస్ పబ్లిష్ అయింది.

 అదేవిధంగా అదే రోజు జైలు నుంచి విడుదలైన మరో మహిళా ఖైదీ ఆడియో వాయిస్ సోషల్​మీడియాలో వైరల్​అయింది. మరో వైపు దళిత సంఘాల ఆందోళనలు చేశాయి. దీంతో సబ్​ జైలర్​లక్ష్మీశృతి నిర్లక్ష్యం, బాధ్యతరాహిత్యాన్ని పై ఆఫీసర్లు ప్రాథమికంగా గుర్తించి చర్యలకు నివేదిక ను ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు.

 దీంతో సబ్​ జైలర్​లక్ష్మీశృతిని సస్పెండ్​చేస్తూ రాష్ట్ర  జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. సబ్​ జైలర్​గా వరంగల్​ఉమెన్​ జైలర్ స్రవంతిని పూర్తి స్థాయి ఇన్ చార్జ్ గా నియమించారు.