మార్స్ శాంపిల్స్ కోసం నాసా ప్రయోగం

మార్స్ శాంపిల్స్ కోసం నాసా ప్రయోగం

మల్టిపుల్ స్పేస్ క్రాఫ్ట్స్, రోవర్స్, టచ్ డౌన్స్ వాడుక
మార్స్ పై స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ చేయాలని తహతహ
వాషింగ్టన్: అంతరిక్ష పరిశోధనల్లో ముందంజలో ఉండే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) సరికొత్త ఐడియాలతో దూసుకెళ్తుంటుంది. ఎవరి అంచనాలకు అందని విధంగా వినూత్న ఆవిష్కరణలను సుసాధ్యం చేసే నాసా ఏం చేస్తుందనేది అందరూ గమనిస్తుంటారు. తాజాగా ఈ సంస్థ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. అంగారక గ్రహం ఉపరితలం నుంచి కొన్ని శాంపిల్స్ సేకరించి భూమిపైకి తీసుకొచ్చే యత్నాల్లో ఉన్నట్లు నాసా తన సీక్రెట్ ను రివీల్ చేసింది. మల్టిపుల్ స్పేస్ క్రాఫ్ట్స్, రోవర్స్, టచ్ డౌన్స్ సాయంతో హిస్టరీలోనే తొలిసారి భూమి కాకుండా ఇతర గ్రహం మీద రాకెట్ లాంచ్ చేయడం లాంటి ఫెంటాస్టిక్ స్టఫ్​ను నాసా చేయనుందనేది తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది. ఈ మిషన్ లో భాగంగా నిర్ణీత ప్లాన్ ప్రకారం పనులు మొదలైతే జూలైలో రోవర్ ను లాంచ్ చేస్తారు. వచ్చే ఫిబ్రవరిలో రివర్ డెల్టాకు జన్మ స్థానమైన జజెరో క్రాటర్ లో ఈ రోవర్ ల్యాండ్ అవుతుంది. మార్స్ గ్రహానికి సంబంధించిన జీవన విధానం రివర్ డెల్టాలో లభ్యమవుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. రివర్ డెల్టాలోని 30 చిన్నపాటి జియోలాజికల్ సాంప్లింగ్ ట్యూబ్స్ లో చాలా కిలో మీటర్లు డ్రైవ్ చేస్తూ రోవర్ శాంపిల్స్​సేకరిస్తుంది. డ్రిల్, సాయిల్ స్కూప్స్ తో రోవర్ ఎనేబుల్ అవుతుంది. శాంపిల్స్ సేకరణ తర్వాత రోవర్ లోని ట్యూబులు భూమి మీదకు తిరిగి వస్తాయి. అందుకు అవసరమైన రెండు స్పేస్ క్రాఫ్ట్ లను 2026లో నాసా మార్స్ పైకి పంపనుంది. ఆ రెండింటిలో మొదటిది మార్స్ యాస్సెంట్ వెహికిల్. ఇది శాంపిల్స్ సేకరించడానికి తయారు చేసిన చిన్న స్పేస్ క్రాఫ్ట్. దీన్ని క్రేటర్ కు పంపుతారు. దీంట్లో కంటెయినర్ శాంపిల్స్ ను తీసుకొస్తుంది. రెండోది కూడా చిన్న సైజులో ఉండే రోవర్. ఇది కూడా శాంపిల్స్ ను కలెక్ట్ చేస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్స్ మీద దుమ్ము తుఫానులు, శీతాకాలం లేని సమయంలో ఈ మిషన్ తన పని మొదలుపెడుతుంది.

యాస్సెంట్ వెహికిల్స్ లో భూమ్మీదకు శాంపిల్స్
మార్స్ యాస్సెంట్ వెహికిల్ లో భూమి పైకి శాంపిల్స్ ను తీసుకొచ్చే ప్రక్రియ మొదలవుతుంది. ఈ క్రమంలో యాస్సెంట్ వెహికిల్​బ్లాస్ట్ అయి కంటెయినర్ ను మార్స్​ఆర్బిట్ లో ఉంచుతుంది. ఇది విజయవంతమైతే గొప్ప హిస్టారికల్ మూమెంట్ అవుతుంది. ఇప్పటివరకూ ఏ దేశమూ మార్స్ సర్ఫేస్ మీద క్రాఫ్ట్ ను లాంచ్ చేయలేకపోయింది. నిర్ణీత ప్లాన్ ప్రకారం రెండో స్పేస్ క్రాఫ్ట్ శాంపిల్ కంటెయినర్ ను గుర్తించి దాన్ని భూమ్మీదకు తీసుకొని వస్తుంది. ఇప్పటివరకు మార్స్ ఆర్బిట్ తో ఏకకాలంలో రెండు స్పేస్ క్రాఫ్ట్​లు కాంటాక్ట్ లోకి రావడం హిస్టరీలో జరగలేదు. శాంపిల్స్ కంటెయినర్ తో స్పేస్ క్రాఫ్ట్​2031 సెప్టెంబర్ కు తిరిగి రావొచ్చని అంచనా.

నాసాతో ఈఎస్ఏ జట్టు
అసాధ్యమైన ఈ మిషన్ ను సుసాధ్యం చేయాలనే ఉద్దేశంతో నాసాతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) జట్టు కట్టింది. మార్స్ యాస్సెంట్ పనులను నాసా శాస్త్రవేత్తలు చూసుకుంటుండగా.. రోవర్, ట్రిప్ బ్యాక్ పనులను ఈఎస్ ఏ సైంటిస్టులు పర్యవేక్షించనున్నారు. అయితే రీసెంట్ గా రష్యన్ స్పేస్ ఏజెన్సీ భాగస్వామ్యంతో ఈఎస్ఏ మార్స్ పైకి రోవర్ ను పంపడంలో ఆలస్యం చేసింది. కరోనా కారణంగా ఈ మిషన్ డిలే అయింది. దీని వల్ల నాసా చేపట్టునున్న మార్స్ మిషన్ పైనా ప్రభావం పడింది.