నాసా ఆర్టెమిస్ 1 ప్రయోగం మళ్లీ వాయిదా.. ఎందుకంటే

నాసా ఆర్టెమిస్ 1 ప్రయోగం మళ్లీ వాయిదా.. ఎందుకంటే

కేప్ కానవెరాల్: చంద్రుడిపైకి ఆర్బిటర్ ను, డమ్మీ ఆస్ట్రోనాట్లను పంపేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టి న ఆర్టెమిస్ 1 ప్రయోగం మళ్లీ వాయిదా పడింది. పోయిన మంగళవారమే ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా.. రాకెట్ లో ఇంధనం లీక్ కావడం వల్ల మిషన్ వాయిదా పడింది.

మళ్లీ లోకల్ టైం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2.17 గంటలకు స్పేస్ లాంచ్ సిస్టం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా..ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు మిషన్ లాంచ్ డైరెక్టర్ ఉదయం ప్రకటించారు. రాకెట్ కోర్ స్టేజీలోకి ఇంధనాన్ని నింపుతుండగా లిక్విడ్ హైడ్రోజన్ లీక్ అయిన విషయాన్ని సిబ్బంది గమనించారని నాసా పేర్కొంది.