అంతరిక్ష ప్రయాణానికి రానుపోను చార్జీలు రూ.400 కోట్లు

అంతరిక్ష ప్రయాణానికి రానుపోను చార్జీలు రూ.400 కోట్లు

ఎక్కడికో తెలుసా…? అంతరిక్ష ప్రయాణానికి! ఇప్పటిదాకా కేవలం ఆస్ట్రోనాట్లు మాత్రమే అంతరిక్షంలోకి వెళుతుండేవాళ్లు. ఇప్పుడు దానిని ‘వ్యాపారం’ చేసేస్తోంది నాసా. ఇంకా అర్థం కాలేదా? మామూలు మనుషులనూ 30 రోజుల అంతరిక్ష టూర్లకు తీసుకుపోవాలని సంస్థ నిర్ణయించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్​ఎస్​) తీసుకెళ్లనుంది. అయితే, చదివారు కదా.. మామూలుగా ఉండదు ఆ ప్రయాణం ఖరీదు. రానుబోను టికెట్​ కోసం ₹402 కోట్లు (5.8 కోట్ల డాలర్లు) చెల్లించాల్సిందే. ఇంకో షాక్​ ఏంటంటే.. అక్కడ ఉండాలంటే ఒక్కో రాత్రికి 35 వేల డాలర్లు కట్టాలి. మన పైసలల్ల అయితే ₹24 లక్షలకు పైమాటే. మరి, అంతరిక్షానికి పోవుడంటే మామూలు విషయం కాదు కదా.. వాటి సూట్లు, ప్రత్యేక ఆహారం, జాగ్రత్తలు ఇవన్నీ ఉంటాయి. అందుకే ఇంత ఖర్చట. రీజనరేటివ్​ లైఫ్​ సపోర్ట్​, టాయిలెట్లకే ₹7.8 లక్షలు చెల్లించాలి. గాలినీ కొనుక్కోవాలి. తిండి, గాలి, మెడికల్​ కిట్​కు మరో ₹15 లక్షలు పే చెయ్యాలి. 30 రోజులకు ₹7.2 కోట్లు ఖర్చవుతాయి. వచ్చే ఏడాది ప్రారంభంలోనే తొలి ట్రిప్పు  ప్రారంభం కాబోతోంది. న్యూయార్క్​లోని నాస్డాక్​లో జరిగిన కార్యక్రమంలో నాసా ఫైనాన్షియల్​ ఆఫీసర్​ జెఫ్​ డెవిట్​ చెప్పారు.