ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ​సిక్తా పట్నాయక్​ కోరారు. మంగళవారం స్థానిక ఓ ఫంక్షన్​హాల్​లో ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్​చైర్మన్ జోగు ప్రేమేందర్​తో కలిసి జాతీయ జెండాలు పంపిణీ చేశారు. అంతకుముందు స్థానిక మహేశ్వరీ థియేటర్​లో గాంధీ సినిమా ప్రదర్శన విద్యార్థులతో కలిసి చూశారు. కార్యక్రమంలో అడిషనల్ ​కలెక్టర్లు రిజ్వాన్​ బాషాషేక్, ఎన్.నటరాజ్, ఆర్డీవో రమేశ్​రాథోడ్, మున్సిపల్ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.

సమరయోధులకు సన్మానం

ఆసిఫాబాద్,వెలుగు: జిల్లాలో నిర్వహించే స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడలోని ఫంక్షన్​హాల్​లో స్వాతంత్ర్య సమరయోధుడు దండనాయకుల శ్రీనివాసరావు దంపతులను సన్మానించారు. అనంతరం జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్​పర్సన్​కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అడిషనల్​కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్​పేయ్, ఆర్డీవో దత్తు తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ ఇంటిపై జాతీయ జెండా

నిర్మల్,వెలుగు: జిల్లాలో ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కలెక్టర్ ముషారఫ్​ అలీ ఫారూఖీ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా అందరికీ జెండాలు పంపిణీ చేశారు. విద్యార్థులందరికీ గాంధీ జీవిత చరిత్ర సినిమా ఫ్రీగా చూపిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్​లోని నారాయణ థియేటర్, భైంసాలో కమల టాకీస్​లో సినిమా ప్రదర్శించినట్లు వివరించారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్​ రెడ్డి, ఎంవీఐ హరీంద్రకుమార్, డీఎస్పీ జీవన్ రెడ్డి, డీపీఆర్​వో తిరుమల, తదితరులు పాల్గొన్నారు.