నేషనల్ మిల్లెట్ స్టార్టప్ సమ్మిట్ షురూ.. ఆకట్టుకున్న మిల్లెట్ టీ, మిల్లెట్ వైన్‌‌

నేషనల్ మిల్లెట్ స్టార్టప్ సమ్మిట్ షురూ.. ఆకట్టుకున్న మిల్లెట్ టీ, మిల్లెట్ వైన్‌‌

హైదరాబాద్, వెలుగు: మూడు రోజుల నేషనల్ మిల్లెట్ స్టార్టప్ సమ్మిట్ హైదరాబాద్‌‌లోని హైటెక్ సిటీ మినర్వా హాల్‌‌లో శనివారం ప్రారంభమైంది.  ఇది ఈ నెల 18 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం కోసం 18 రాష్ట్రాల నుంచి 120 మంది ఎంట్రప్రెన్యూర్లు వచ్చారు. ఈ సమ్మిట్​ మిల్లెట్ యంత్రాలను ప్రదర్శిస్తున్నారు. మిల్లెట్ ఆధారిత తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడంలో సహాయపడతామని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రదర్శించిన మిల్లెట్​టీ, వైన్ ​ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇండియన్ బిజినెస్ అండ్ లీగల్ కన్సల్టెన్సీ సర్వీసెస్​కు చెందిన  పరిశ్రమ నిపుణులు వివిధ అంశాలపై ఎంట్రప్రెన్యూర్లకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మిల్లెట్స్ ది బెస్ట్ ఫుడ్ చైర్మన్ ప్రసన్న శ్రీనివాస్ సారకడం మాట్లాడుతూ ప్రతి మండలంలో ప్రీమియం మిల్లెట్ స్టోర్‌‌లను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నామని అన్నారు.