కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళకు జాతీయ గుర్తింపు 

కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళకు జాతీయ గుర్తింపు 

కరీంనగర్ జిల్లాలోని సిల్వర్ ఫిలిగ్రీ కళకు మరోసారి జాతీయ గుర్తింపు దక్కింది. ఫిలిగ్రీ కళాకారులు వెండి నగిషీతో తయారు చేసిన పల్లకీకి అవార్డు దక్కింది. సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ సంస్థకు చెందిన ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ కిలోన్నర వెండి తీగలతో పల్లకీని 2018లోనే తయారు చేశారు.

దానిని ఢిల్లీలోని జాతీయ హస్త కళల అభివృద్ధి సంస్థకు పంపించగా..అవార్డుకు ఎంపికైంది. కరోనా కారణంగా అవార్డుల ప్రదానం ఆలస్యంగా జరిగింది. ఈనెల 28న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్కర్ చేతుల మీదుగా అశోక్ కుమార్ కు అవార్డును అందించనున్నారు.