నేషనల్ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–13 చెస్ చాంప్.. తెలంగాణ అమ్మాయి దీక్షిత

నేషనల్ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–13 చెస్ చాంప్.. తెలంగాణ అమ్మాయి దీక్షిత

హైదరాబాద్, వెలుగు: నేషనల్ అండర్–-13 చెస్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ అమ్మాయి మోడిపల్లి దీక్షిత విజేతగా నిలిచింది. గోవా వేదికగా ఈ టోర్నీలో మొత్తం 202 మంది పాల్గొన్న గర్ల్స్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో దీక్షిత 11 రౌండ్లలో 9.5 పాయింట్లు సాధించి టైటిల్ గెలుచుకుంది.

 అండర్-–13 గర్ల్స్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణకు  టైటిల్ రావడం ఇది రెండోసారి. గతేడాది శరణ్యాదేవి నటహరి ట్రోఫీ నెగ్గింది. మంగళవారం (సెప్టెంబర్ 09) జరిగిన చివరి రౌండ్‌‌‌‌‌‌‌‌లో దీక్షిత.. గుజరాత్‌‌‌‌‌‌‌‌కు చెందిన అర్పిత పటాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో డ్రా చేసుకొని అత్యధిక పాయింట్లతో చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్  గెలుచుకుంది. 

మహారాష్ట్రకు చెందిన మైషా పెర్వేజ్ 9 పాయింట్లతో రన్నరప్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది.