రామగుండం ఫెర్టిలైజర్స్‌కు నేచురల్ గ్యాస్

రామగుండం ఫెర్టిలైజర్స్‌కు నేచురల్ గ్యాస్
  • రూ.7,225 కోట్లతో మల్లవరం–భిల్వాడా పైప్ లైన్ ద్వారా సరఫరా
  • లోక్ సభలో కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: రామగుండం ఫెర్టిలైజర్స్ కు మల్లవరం–భిల్వాడా పైప్ లైన్ ద్వారా నేచురల్ గ్యాస్ అందిస్తున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.1, 881 కి.మీ. పొడవైన ఈ పైప్ లైన్ కోసం7,255 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. గ్యాస్ పైపు లైన్ల అంశంపై సోమవారం పలువురు ఎంపీలు లోక్ సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 

కృషి సించాయ్ కింద తెలంగాణకు రూ.937. 53 కోట్లు
గత ఐదేళ్లలో ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన(పీఎంకేఎస్ వై )లో భాగంగా ఏఐబీపీ కింద ఎంపిక చేసిన తెలంగాణలోని 11 ప్రాజెక్టులకు రూ. 937. 53 కోట్లు ఇచ్చినట్లు  కేంద్రం వెల్లడించింది. నాబార్డు ద్వారా నిధుల్ని విడుదల చేసినట్లు తెలిపింది. సోమవారం రాజ్యసభలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అడిగిన ప్రశ్నకు  కేంద్ర మంత్రి రతన్ లాల్ కటారియా సమాధానం ఇచ్చారు. ఈ స్కీమ్లో తెలంగాణ నుంచి గొల్లవాగు, రాలి వాగు, మత్తడి వాగు, పాలెం వాగు, పెద్దవాగు, ఎస్ఆర్ఎస్పీ, కుమ్రం భీం ప్రాజెక్టు, రాజీవ్ భీమా, నీల్వాయ్ ప్రాజెక్టు, ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్, జె.చొక్కారావు ప్రాజెక్టులు ఉన్నాయన్నారు.

తెలంగాణ నుంచి ఆర్మీలో 12, 589 మంది..
ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల్లో తెలంగాణకు చెందిన 12, 589 మంది సేవలందిస్తున్నారని రక్షణ శాఖ వెల్లడించింది. ఇందులో ఎయిర్ ఫోర్స్  42 మంది ఆఫీసర్లుగా, 1, 082 మంది ఎయిర్ మెన్లు గా చేస్తున్నట్లు తెలిపింది. అలాగే నేవీలో 32 మంది ఆఫీసర్లుగా, 463 మంది సేయిలర్లుగా ఉన్నారంది. ఆర్మీలో అత్యధికంగా 10, 970 మంది జేసీఓ, ఓఆర్ లుగా సేవలందిస్తన్నట్లు  మంత్రి శ్రీపాద నాయక్ ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

తెలంగాణలోని కేవీ, జేఎన్వీ ల్లో 479 ఖాళీలు
తెలంగాణలోని 35 కేంద్రీయ విద్యాలయాలు(కేవీ), 9 జవహర్ నవోదయ విద్యాలయాల్లో(జేఎన్ వీ) మొత్తం 479  పోస్టులు ఖాళీలుగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ వెల్లడించారు. కేవీల్లో 259  టీచింగ్, 155 నాన్ టీచింగ్ పోస్టులు, జేఎన్ వీల్లో 49 టీచింగ్, 16 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంపీ రేవంత్ అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీసు పెట్టినం - ఎంపీ సురేశ్ రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు

 సుగంధ ద్రవ్యాల ఎగుమతుల ప్రచారం కోసం కేంద్ర వాణిజ్య శాఖ సైసెస్ బోర్డు జీనినల్ కార్యాలయాన్ని నిజామాబాద్ లో ఏర్పాటు చేశామని కేంద వ్యవసాయ మంత్రి నరేంద సింగ్ తోమర్ చెప్పారు. పసుపుతో పాటు ఇతర సుంగధ ద్రవ్యాల ఎగుమతి ప్రచారం కోసం వరంగల్, హైదరాబాద్, నిజామాబాద, ఖమ్మం నగరాలోల్ బోర్డు కార్యాలయాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని చెప్పారు. ఎంపీ సురేశరెడిడ్ అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. 

కాళేశ్వరానికి పైసలియ్యండి - రాజ్యసభలో ఎంపీ బండ ప్రకాశ్ వినతి

కాళేశ్వరం ప్రాజెక్టు ను మూడేళల్లో పూర్తి చేసినప్పుడు జలశక్తి శాఖ మంత్రులు, అధికారులు అభినందించారే తప్ప నిధులివ్వలేదని ఎంపీ బండ ప్రకాశ్ అన్నారు. తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులపై కేందం దృష్టి పెట్టాలని కోరారు.