
నేచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం దసరాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు హీరో నాని. ఇప్పుడు మరోసారి అదే రిజల్ట్ ను రిపీట్ చేసేందుకు హాయ్ నాన్నతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఈ ఎమోషనల్ మూవీ డిసెంబర్ 7న థియేటర్స్ లోకి రానుంది. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు మేకర్స్.
ఇందులో భాగంగా నెటిజన్స్ తో ఆస్క్ మీ అని సేషన్ నిర్వహించారు హీరో నాని. నెటిజన్స్ అడిగిన చాలా ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు నాని. ఈ క్రమంలో ఒక నెటిజన్.. కొత్తగా వచ్చిన దర్శకులలో పనిచేయాలంటే ఎవరితో చేస్తారు? అని అడిగారు. దానికి సమాధానంగా నాని మాట్లాడుతూ.. కథ బాగుంటే కొత్త దర్శకులకు ఛాన్స్ ఇవ్వడానికి నేను ఎప్పుడు ముందుంటాను. ప్రస్తుతం చేస్తున్న హాయ్ నాన్న దర్శకుడు కూడా కొత్తవారే. ప్రస్తుతం ఉన్న దర్శకులలో అంటే బలగం సినిమా దర్శకుడు వేణు తో వర్క్ చేయాలని ఉంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మరి దానికి దర్శకుడు వేణు నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. నిజంగా ఈ కాంబోలో సెట్ అయ్యి సినిమా వస్తే మాత్రం అది నెక్స్ట్ లెవల్లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read:-కమర్షియల్ కంటెంట్‌తో..