వారం వాయిదా పడిన రాక్షస కావ్యం మూవీ రిలీజ్

వారం వాయిదా పడిన రాక్షస కావ్యం మూవీ రిలీజ్

నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రలు పోషించిన  సినిమా ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్ కీర్తి దర్శకత్వంలో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మించారు. అక్టోబర్ 6న సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే మరో వారం ఆలస్యంగా అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు శనివారం కొత్త రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటించారు మేకర్స్.

సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ ఇచ్చేందుకు పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరింత క్వాలిటీ కోసమే వారం రోజులు వాయిదా వేస్తున్నట్టు తెలియజేశారు.  పురాణాల ఆధారంగా ప్రస్తుత జనరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి అర్ధమయ్యేలా ఈ  చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.