కాణిపాకంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

కాణిపాకంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

చిత్తూరు జిల్లా: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఏర్పాటు చేసిన నూతన ధ్వజ స్తంభంపై మూషిక పటాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సిద్ధి బుద్ధి సమేతంగా హంస వాహనంపై ఆసీనుడైన వినాయకుడు ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సురేష్ బాబు, కమిటీ చైర్మన్ మోహన్ రెడ్డి, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. హంస వాహన సేవకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.