
లేడీ సూపర్ స్టార్ నాయనతార మరో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టనుందా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రౌడీ పిక్చర్స్ సంస్థ ద్వారా నిర్మాతగా మారిన నయన్.. ఇప్పుడు మరో కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేయనుందట. తాజాగా చైన్నెలో అగస్త్య పేరుతో ఉన్న ఒకప్పటి ఫేమస్ థియేటర్ ఒకటి మూతపడింది. తాజా సమాచారం ప్రకారం తొందర్లోనే ఈ థియేటర్ రూపం మారబోతోందట.
దీన్ని కొనుగోలు చేసి షాపింగ్ మాల్స్‌తో కూడిన మల్టీప్లెక్స్ థియేటర్‌గా మార్చే ప్రయత్నంలో ఉందట నయనతార. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ న్యూస్ పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు.
ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హీరోగా వస్తున్న జవాన్ మూవీలో నటిస్తోంది. తమిళ డైరెక్టర్ అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అడిస్తున్నాడు.