
అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable with NBK) అంటూ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలకృష్ణ (Balakrishna). గతంలో తెలుగులో వచ్చిన టాక్ షోలకు భిన్నంగా షోను హోస్ట్ చేస్తూ బాలయ్య..అస్సల్ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఈ షోలో బాలయ్య ఎనర్జీ, టైమింగ్, అదిరిపోయే ప్రశ్నలతో అదరగోడుతున్నారు. గెస్ట్‌గా ఎవరు వచ్చినా వారితో సరదా మాటలతో పాటు ఆటలు ఆడిస్తూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నారు.
తాజాగా అన్‌స్టాపబుల్ టాక్ షో నెక్స్ట్ సీజన్4పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. దసరా కానుకగా అక్టోబర్ నుంచి టాక్ షో ప్రారంభం కానున్నట్లు ఆహా ఓటీటీ వెల్లడించింది. ఈ సందర్బంగా ఛీఫ్ గెస్టులుగా ఎవరుస్తారనే విషయం ఆడియన్స్ లో ఆసక్తి రేపుతోంది.
అయితే రానున్న టాక్ షోకు టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు కోలీవుడ్, మాలీవుడ్, సాండల్‌వుడ్ పాన్ ఇండియా స్టార్స్ వస్తారని తెలుస్తోంది. ఈ షో దసరా కానుకగా అక్టోబర్ లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ షో సీజన్ వన్, సీజన్ 2లకు పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు, ప్రభాస్‌తో పాటు పలువురు స్టార్ హీరోలతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గెస్ట్‌లుగా రావడం హాట్ టాపిక్‌గా మారింది. మరి రానున్న షోలో ఫస్ట్ ఎపిసోడ్ కి ఎవరు వస్తారనేది త్వరలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది.
#UnstoppableWithNBK Next Season starts soon❤️?#NandamuriBalakrishna #JaiBalayya #NBK109 #50YearsofLegendNBKinTFI pic.twitter.com/phfwAbqNd1
— manabalayya.com (@manabalayya) August 8, 2024