
జూబ్లీహిల్స్, వెలుగు: సినీ నటి కరాటే కల్యాణిపై శనివారం బంజారాహిల్స్‌లోని ఎన్బీటీ నగర్‌కు చెందిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నామని కల్యాణి తమపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని బంజారాహిల్స్ ఏసీపీ వెంకట్ రెడ్డికి వివరించారు.
ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తాము చేస్తున్న ప్రయత్నాన్ని తప్పు బట్టి, తమను లేడీ బౌన్సర్లు అనే పదాలతో కించపరిచేలా మాట్లాడుతున్నారన్నారు. కల్యాణిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.