ఎన్‎సీసీ ఫౌండర్రాజు ‘స్టాండింగ్ టాల్’ పుస్తకావిష్కరణ

ఎన్‎సీసీ ఫౌండర్రాజు ‘స్టాండింగ్ టాల్’ పుస్తకావిష్కరణ

న్యూఢిల్లీ: ఎన్‎సీసీ ఫౌండర్, చైర్మన్​ఎమిరటస్ డాక్టర్ ఏవీఎస్​రాజు ‘స్టాండింగ్​ టాల్’ పేరుతో రాసిన ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో హైదరాబాద్‎లో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ కేంద్రమంత్రి అశోక్​గజపతిరాజు, శాంతా బయోటిక్స్​చైర్మన్​వరప్రసాద్​ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఇన్​ఫ్రాస్ట్రక్చర్​రంగంలో రాజు సాధించిన విజయాలు, కంపెనీ ఎదుగుదలకు ఆయన చేసిన కృషి గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. సాహిత్య, వాణిజ్యరంగాల్లో చేసిన సేవలకు గాను ఆయనకు లిమ్కా బుక్​ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్​ వరల్డ్​రికార్డ్​లో స్థానం దక్కింది. కేంద్రం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.