కొత్తపల్లి, వెలుగు : కొత్తపల్లి పట్టణంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈ నెల 11 వరకు ఎన్‌సీసీ క్యాంపు నిర్వహిస్తున్నట్లు కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ డేనియల్ లాడ్జింగ్ తెలిపారు. ఇందులో భాగంగా ఎన్‌సీసీ కాడెట్స్‌కు డ్రిల్,
మ్యాప్ రీడింగ్, ఫైరింగ్, సోషల్ యాక్టివిటీస్, ట్రైనింగ్, కల్చరల్ యాక్టివిటీస్ నేర్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ పి.ఫాతిమారెడ్డి, ఏవో రాకేశ్వర్ జస్వల్, ఎస్ఎం సాగర్ సింగ్ పాల్గొన్నారు.