హైదరాబాద్, వెలుగు: ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి వద్ద కొత్త సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్‌ను ప్రారంభించింది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ దీనిని ప్రారంభించారు. సుమారు రూ.250 కోట్ల వ్యయంతో, 40 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు.
ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్ ద్వారా కంపెనీ ఉత్పత్తి సామర్థ్యానికి అదనంగా 6.60 లక్షల టన్నులు చేరనుంది. దీంతో సంస్థ మొత్తం సిమెంట్ సామర్థ్యం సంవత్సరానికి 40 లక్షల టన్నులకు చేరుకుందని ఎన్సీఎల్ గ్రూప్ తెలిపింది.
