గోల్డ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి

గోల్డ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి

ముంబై:దేశంలో గోల్డ్​ బ్యాంకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆర్​బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్​ గాంధి సూచించారు. ప్రజల వద్ద ఉన్న బంగారాన్ని మానిటైజ్​ చేసేందుకు ఇది ఆవశ్యకమని చెప్పారు. మన దేశంలోని ప్రజలకు బంగారాన్ని ఫిజికల్​గా  (బంగారంగానో లేదా నగలుగానో) అట్టేపెట్టుకోవడం ఇష్టమని, దానిని దృష్టిలో పెట్టుకునే మనం వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. ఎకానమీ డెవలప్​మెంట్​ కోసం  గోల్డ్​ను మానిటైజ్​ చేసుకోవడం మేలని అన్నారు. దేశంలోని హౌస్​హోల్డ్స్, మత సంస్థల​ వద్ద 23 వేల నుంచి 24 వేల టన్నుల బంగారం ఉందని, కాకపోతే ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చడం అంత ఈజీ కాదని గాంధి అభిప్రాయపడ్డారు. గోల్డ్​ బ్యాంకు ఏర్పాటు ప్రపోజల్​ను మరోసారి సీరియస్​గా ఆలోచించాల్సిన టైము వచ్చిందని పేర్కొన్నారు.  గోల్డ్​ డిపాజిట్లను తీసుకుని, గోల్డ్​ లోన్లు మాత్రమే ఇచ్చేలా ఈ బ్యాంకు ఉండాలన్నారు. డిజిటల్​ లెండింగ్​ కంపెనీ రూపీక్​ నిర్వహించిన వర్చువల్​ ఈవెంట్లో గాంధి మాట్లాడారు. 

ఫైనాన్షియల్​ గోల్డ్​కు చాలా ఆప్షన్లు వచ్చాయ్​..
ప్రజలకు ఇప్పుడు గోల్డ్​ డిపాజిట్లు, గోల్డ్​ మెటల్​ లోన్లు, గోల్డ్​ బాండ్లు, గోల్డ్​ ఈటీఎఫ్​ వంటి ఫైనాన్షియల్​ గోల్డ్ ఇన్వెస్ట్​మెంట్​​ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయని గాంధి పేర్కొన్నారు. గోల్డ్​ బాండ్లు, గోల్డ్​ ఈటీఎఫ్​ స్కీములు ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే ప్రజల చేతిలో ఉన్న బంగారం వినియోగంలోకి తేవాలంటే గోల్డ్​ డిపాజిట్ల ద్వారా సాధ్యపడుతుందని ఆర్​బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్​ పేర్కొన్నారు. ప్రస్తుత బంగారం ధరలకు కొత్తగా తెచ్చే ప్రొడక్టులను లింక్​ చేయాలని, అవగాహన పెంచేందుకు మార్కెటింగ్​ ప్రోగ్రామ్స్​ నిర్వహించాలని చెప్పారు. ఫలితంగా పబ్లిక్​ సేవింగ్స్​ ఇన్వెస్ట్​మెంట్లు, క్యాపిటల్​గా మారుతాయని అన్నారు. ఫిజికల్​ గోల్డ్​ నుంచి ప్రజలను మళ్లించడానికి చాలా ఛాలెంజెస్​ ఉంటాయని చెబుతూ, వారి ఆలోచనలను అంత ఈజీగా మార్చలేమని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఆభరణాల రూపంలోనే బంగారాన్ని ఎందుకు ఇష్టపడుతున్నారో తెలుసుకోవల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇనొవేటివ్​ థింకింగ్​ కావాలని అంటూ గోల్డ్​ డిపాజిట్​ స్కీము ఎలా ఉండాలో తన అభిప్రాయాన్ని చెప్పారు గాంధి. ఎవరైనా ఒక టైపు జ్యుయెలరీ తెచ్చి డిపాజిట్​ చేస్తే, పదేళ్ల తర్వాత అదే టైపు జ్యుయెలరీ డిపాజిటర్​కు తిరిగి ఇచ్చేలా స్కీములు ఉండాలని అన్నారు. దీని వల్ల చాలా బంగారాన్ని మానిటైజ్​ చేసుకునే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఫైనాన్షియల్​ గోల్డ్​ వైపు మళ్లేలా లాంగ్​ టర్మ్​ మిషన్​ అమలు కావాలని చెప్పారు. ప్రతి ఇంటిలోనూ గోల్డ్‌‌గా పొదుపు చేసే ప్రతీ రూపాయీ ఎకానమీ గ్రోత్​కు పెట్టుబడిగా, క్యాపిటల్​గా మారాలని చెప్పారు. గోల్డ్​ మానిటైజేషన్ వల్లే ఇది సాధ్యమవుతుందన్నారు. 

హైగ్రోత్​కు బంగారం మానిటైజేషన్​.....
క్రమం తప్పకుండా ఎక్కువ గ్రోత్​ రేటు సాధించాలనుకునే ఇండియా లాంటి ఎమర్జింగ్​ ఎకానమీలకు చాలా క్యాపిటల్​ అవసరమని గాంధి చెప్పారు. ఫలితంగా దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. గోల్డ్​ బ్యాంకు ఏర్పాటుకు కొన్ని రూల్స్​ అవసరమని, చట్టపరమైన ఫెసిలిటేషన్ కూడా కావాలని చెప్పారు. గోల్డ్​ బ్యాంకు లైసెన్సింగ్​ పాలసీ తేవాలని, క్యాష్​ రిజర్వ్​ రేషియో, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో వంటి నిబంధనలూ తేవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఫిజికల్​ గోల్డ్​ను మానిటైజ్​ చేయడానికి గోల్డ్​ బ్యాంకు క్యాటలిస్ట్​గా, మార్కెట్​ మేకర్​గా ఉంటుందని చెప్పారు. గత కొన్నేళ్లుగా దేశంలో బంగారంపై పాలసీలు మారుతూ వస్తున్నాయని, ఫైనాన్షియల్​ గోల్డ్​లో పెట్టుబడులు పెట్టేలా ప్రజలను ఎంకరేజ్​ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల చేతిలోని గోల్డ్​ హోల్డింగ్స్​ మానిటైజేషన్​కు చొరవ తీసుకోవాలని, బంగారం క్వాలిటీ కంట్రోల్​కు లైసెన్స్​డ్​ రిఫైనరీలు, హాల్​మార్కింగ్​ వంటి ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఏర్పాటు చేయాలని కూడా గాంధి సూచించారు.