నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టిన నీరజ్ చోప్రా

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టిన నీరజ్ చోప్రా

ప్రతిష్టాత్మక స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. డైమండ్ లీగ్ లో నీరజ్ జావెలిన్ ను 89.94 మీటర్లు త్రో చేసి సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. దీంతో తనపేరుతో ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. డైమండ్ లీగ్ లో నీరజ్ కు ఇదే తొలి పతకం. ఫస్ట్ టైం 89.94 మీటర్లు త్రో చేయగా... ఆ తర్వాత వరుసగా 87.37 మీటర్లు, 84.77, 86.84 మీటర్లు త్రో చేశాడు. అయితే వరల్డ్  చాంపియన్  ఆండర్సన్  పీటర్స్  సెకండ్ టైం 90.31 మీటర్లు విసిరి...సరికొత్త రికార్డు సృష్టించాడు. పీటర్స్  స్వర్ణం కైవసం చేసుకోగా....జూలియన్  వెబర్  89.08 మీటర్లతో కాంస్య పతకం దక్కించుకున్నాడు.