Nenu Ready Teaser: ‘నేను రెడీ’ టీజర్‌తోనే హైప్.. ‘ధమాకా’ డైరెక్టర్ నుంచి మరో ఎంటర్‌టైనర్

Nenu Ready Teaser: ‘నేను రెడీ’ టీజర్‌తోనే హైప్.. ‘ధమాకా’ డైరెక్టర్ నుంచి మరో ఎంటర్‌టైనర్

హవీష్ హీరోగా,  ‘ధమాకా’ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో నిఖిల కోనేరు నిర్మిస్తున్న చిత్రం ‘నేను రెడీ’. రీసెంట్‌‌గా ఈ మూవీ టీజర్‌‌ను ‘రాజా సాబ్’  చిత్రంతో పాటు థియేటర్లలో ప్రదర్శించగా, సోమవారం డిజిటల్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ టీజర్ ఎంటర్‌‌‌‌టైనింగ్ కథాంశాన్ని పరిచయం చేస్తుంది. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే బాధ్యత గల మధ్యతరగతి  ఆంధ్ర యువకుడికి,  ఒక మధ్యతరగతి తెలంగాణ అమ్మాయితో నిశ్చితార్థం జరగడం, దానివల్ల కల్చర్, లైఫ్ స్టయిల్ మధ్య హిలేరియస్ కాన్‌‌ఫ్లిక్ట్‌‌కి  దారితీయడం ఆసక్తికరంగా ఉంటుంది.  

అమ్మాయి కుటుంబం మాంసాహారాన్ని అమితంగా ఇష్టపడటం, అబ్బాయి కుటుంబం శాకాహారాన్ని పాటించడం వంటి సహజమైన పరిస్థితుల ద్వారా హాస్యాన్ని పండించారు. మధ్యలో యాక్షన్ సీన్స్‌‌తోనూ ఆకట్టుకున్నాడు హవీష్. ‘ఎస్కార్ట్‌‌తో షిప్‌‌తో వచ్చినా సరే, ఫైరింగ్ చేస్తూ ఫైటర్ జెట్‌‌లో వచ్చినా సరే  24/7 నేను రెడీ’ అంటూ తను చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచింది. 

కావ్య థాపర్ తనదైన గ్లామర్‌‌‌‌తో ఆకట్టుకోగా, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్ వంటి హాస్య నటులు ఉండటంతో, ఈ చిత్రం నాన్‌‌స్టాప్ వినోదాన్ని అందిస్తుందని ప్రామిస్ చేస్తుంది.  విక్రాంత్ శ్రీనివాస్ కథ, స్క్రీన్‌‌ప్లే,  మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.