8 పరుగులకే ఆలౌట్.. హిస్టరీలోనే చెత్త రికార్డు

 8 పరుగులకే ఆలౌట్.. హిస్టరీలోనే చెత్త రికార్డు

వరల్డ్ క్రికెట్ హిస్టరీలో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. మలేషియాలో జరుగుతున్న ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌ మ్యాచ్ లో నేపాల్ మహిళల జట్టు యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్(యూఏఈ) తలపడ్డాయి... టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కి దిగిన నేపాల్ జట్టు కేవలం 8 పరుగులకే ఆలౌటైంది.

దీంతో క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్ కే ఆలౌటైన జట్టుగా రికార్డులకి ఎక్కింది. నేపాల్ జట్టులో ఆరుగురు డకౌట్ అయ్యారు. స్నేహ మహారా 3, మనీష్ రాణా 2 పరుగులు చేశారు. యూఏఈకి చెందిన బౌలర్ మహికా గౌర్ 5 వికెట్లు తీసింది.

ఇక 9 పరుగుల లక్ష్యాన్ని యూఏఈ కేవలం 1.1 ఓవర్లలోనే ఛేదించింది. మొత్తం మ్యాచ్ 9.2 ఓవర్లతో గంటసేపు సాగింది. అంతకుముందు శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఖతార్‌ జట్టును 38 పరుగులకే ఆలౌట్ చేసి 79 పరుగుల తేడాతో నేపాల్ విజయం సాధించింది.

మరిన్ని వార్తల కోసం... 

ఫ్రెంచ్ ఓపెన్ విజేత ఇగా స్వైటెక్