పిల్లలకు తినిపించే సెరెలాక్‌లో షుగర్ లెవల్స్: ఎంత ప్రమాదమో తెలిస్తే షాక్

పిల్లలకు తినిపించే సెరెలాక్‌లో షుగర్ లెవల్స్: ఎంత ప్రమాదమో తెలిస్తే షాక్

చిన్న పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిపాలతోపాటు అన్ని రకాల పోషకాలు సరిగా అందాలి. చాలా మంది తల్లులు పిల్లల్ని పాలు మాన్పించడానికి, ఫుడ్ అలవాటు చేయడానికి సెర్లాక్ తినిపిస్తుంటారు. పిల్లలు కూడా దాన్ని ఇష్టంగా తింటారు. నెలల పిల్లల నుంచి ఐదారేళ్ల వయస్సు వరకు రెడిమేడ్ ఫుడ్ అయిన బేబీఫుడ్ సెర్లాక్ తినిపించటం కామన్.

ఈ సెర్లాక్ ప్రాడక్ట్ ను నెస్లే కంపెనీ తయారు చేస్తుంది. వివిధ ఫ్లేవర్స్ తో సెర్లాక్ 15 రకాలుగా మార్కెట్ లో అందుబాటులో ఉంది. తాజాగా చేసిన పబ్లిక్ ఐ పరిశోధనలో షాకింగ్ న్యూస్ వెలువడింది. భారత్ లో తయారైయ్యే సెరెలాక్‌లో ఒకసారి తినిపించే సెరెలాక్‌లో 3 గ్రాముల షుగర్ ఉంటుందని ఆ పరిశోధనలో తేలింది. భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే పాలు, సెరెలాక్‌ ఉత్పత్తుల్లో చక్కెర, తేనే జోడిస్తున్నట్టు పబ్లిక్ ఐ తేల్చింది.

అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా

 అంతర్జాతీయ నిబంధనల ప్రకారం, చిన్నారులకు కోసం తయారు చేసే ఫుడ్ ఐటమ్స్ లో చక్కెర స్థాయిలు ఉండకూడదు. ఊబకాయం, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఈ నిబంధనను అమల్లోకి తెచ్చారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి పేద దేశాల్లో నెస్లే ఈ నిబంధనను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్టు తేలింది. పిల్లలు తినే ఆహారంలో యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ స్విట్జర్లాండ్ మరియు ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో చక్కెర రహితంగా ఉన్నాయని పబ్లిక్ ఐ పరిశోధనలో తేలింది.

చాలా సందర్భాల్లో ఆయా ఉత్పత్తుల్లో షుగర్ లెవల్స్ ప్యాకేజింగ్‌పై ముద్రించట్లేదని కూడా పబ్లిక్ ఐ పేర్కొంది. ఇవే ఉత్పత్తుల్ని నెస్లే.. చక్కెర లేకుండా ఐరోపాలో విక్రయిస్తోంది.  

చిన్న పిల్లలకు చక్కెర తెచ్చే ప్రమాదం

పబ్లిక్ ఐ పరిశోధన పై నెస్లే స్పందించింది. గత ఐదేళ్లల్లో తాము భారత్‌లోని చిన్నారుల ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని 30 శాతం మేర తగ్గించామని చెప్పుకొచ్చింది. చక్కెర వ్యసనంగా మారే అవకాశం ఉందని, కాబట్టి చిన్న పిల్లల ఉత్పత్తులకు దీన్ని జత చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

‘‘తీపికి అలవాటు పడ్డ చిన్నారులు, అలాంటి ఫుడ్స్‌వైపే మొగ్గుచూపుతారు. ఫలితంగా చిన్నతనంలో శరీరానికి తగిన పోషకాలు అందక పెద్దాయ్యాక అనారోగ్యాల బారిన పడే అవకాశం పెరుగుతుంది’’ అని బ్రెజిల్‌లోని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ తెలిపారు. థాయిల్యాండ్, ఇథియోపియా ఉత్పత్తులో చక్కెర స్థాయి సర్వీంగ్‌కు 6 గ్రాములుగా