Anupama Parameswaran: అదేంటి బామ్మర్ది అనేశారు.. అనుపమ పోస్ట్పై నెటిజన్స్ రియాక్షన్

Anupama Parameswaran: అదేంటి బామ్మర్ది అనేశారు.. అనుపమ పోస్ట్పై నెటిజన్స్  రియాక్షన్

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అఆ సినిమాతో మంచి బ్రేక్ అందుకుంది. ఆ సినిమా తరువాత వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేసి స్టార్స్ లిస్టులో చేరిపోయింది. అయితే కెరీర్ మొదట్లో పద్ధతైన పాత్రల్లో కనిపించిన అనుపమ.. ప్రస్తుతం గ్లామరస్ రోల్స్ తో కుర్రకారును కవ్విస్తోంది. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా నటించిన టిల్లు స్క్వైర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న ఈ సినిమా మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇదిలా ఉంటే.. రీసెంట్ గా అనుపమ పెట్టిన ఇన్స్టా పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ పోస్ట్ లో అనుపమ తన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరి.. బర్త్ డే విషెష్ చెప్తే వైరల్ అవడం ఏంటా? అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. అనుపమ చాలా మందికి క్రష్. ఆమెను తన ఫ్యాన్స్ దొండకాయ్, బెండకాయ్.. అనుపమ నా గుండెకాయ్, అల్లం బెల్లం అనుపమ నా పెళ్ళాం అంటూ సరదాగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ కామెంట్స్ పై అనుపమ కూడా స్పందించారు. అందుకే ఫ్యాన్స్ ఇప్పుడు అనుపమ తమ్ముడి పుట్టినరోజు సందర్బంగా అతనికి విషెష్ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే బామ్మర్ది అని, మీ అక్కను బాగా చూసుకోరా బామ్మర్ది.. అంటూ ఫన్నీ గా కామెంట్లు చేస్తున్నారు. దీంతో అనుపమ పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. 

Also Read: తిరుమల శ్రీవారి దర్శనం కొరకు..కాలినడకన టాలీవుడ్ హీరోయిన్