ఆ పేరు ఎత్తే అర్హత నీకు లేదు.. రష్మికపై ఫైర్ అవుతున్న నెటిజన్స్

ఆ పేరు ఎత్తే అర్హత నీకు లేదు.. రష్మికపై ఫైర్ అవుతున్న నెటిజన్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna)పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. నటి సౌందర్య బయోపిక్(Soundarya Biopic) విషయంలో ఆమెను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మికపై ట్రోలింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన్నా నటి సౌందర్య బయోపిక్ పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

చిన్నప్పుడు రష్మిక వాళ్ళ నాన్న ఆమెను సౌందర్యలా ఉన్నావు అనేవాడని, తనకు కూడా చిన్నప్పటినుండి సౌందర్య అంటే ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఒకవేళ అవకాశం వస్తే ఆమె బయోపిక్ లో నటించాలని ఉందంటూ తన మనసులో మాటను బయట పెట్టింది. ఈ న్యూస్ అప్పట్లో వైరల్ గా మారింది కూడా. అయితే ఇదే విషయంపై రష్మికను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. సౌందర్య బయోపిక్ కాదు ఆమె పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోలింగ్ రష్మిక వరకు వెళ్లాయా, దానిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇక రష్మిక మందన్నా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప2 సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత బాలీవుడ్ లో రెండు సినిమాలు, తమిళ్ లో ఒక సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమాలు ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తాయా చూడాలి.