నెట్​లింక్స్​ లాభం రూ. 1.34 కోట్లు

నెట్​లింక్స్​ లాభం రూ. 1.34 కోట్లు

హైదరాబాద్​, వెలుగు :  నెట్​లింక్స్​ లిమిటెడ్​ రెవెన్యూ సెప్టెంబర్​ 2023 క్వార్టర్లో 97 శాతం పెరిగి రూ. 4.71 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది క్యూ2 లో కంపెనీ రెవెన్యూ రూ. 2.39 కోట్లు మాత్రమేనని కంపెనీ తెలిపింది. సెప్టెంబర్​ 2023 క్వార్టర్లో లాభం ఏకంగా 261 శాతం గ్రోత్​తో రూ. 1.34 కోట్లయింది. అంతకు క్రితం ఏడాది క్యూ2 లో నెట్​లింక్స్​ లిమిటెడ్​ లాభం రూ. 37 లక్షలే. క్యూ2 లో మంచి పెర్​ఫార్మెన్స్​ సాధించగలిగామని, కంపెనీ చేజిక్కించుకున్న రూ. 11.20 కోట్ల పెద్ద ఆర్డరు వల్లే ఇది సాధ్యమైందని నెట్​లింక్స్​ మేనేజింగ్​ డైరెక్టర్​ డా మనోహర్​ లోకారెడ్డి చెప్పారు. రాబోయే క్వార్టర్స్​లోనూ ఇదే ట్రెండ్​ కొనసాగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వాటాదారులకు లాంగ్​టర్మ్​ వాల్యూ క్రియేట్​ చేసే దిశలో బోనస్​ షేర్స్​ ఇష్యూను సక్సెస్​ఫుల్​గా పూర్తి చేశామని అన్నారు.