దేశ చరిత్రలో ఎన్నడూ లేదు..కాంగ్రెస్ పై స్మృతి ఇరానీ ఆగ్రహం

దేశ చరిత్రలో ఎన్నడూ లేదు..కాంగ్రెస్ పై స్మృతి ఇరానీ ఆగ్రహం

ప్రధాని  మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తడంపై  కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఏన్నడూ లేని విధంగా పంజాబ్ ప్రభుత్వం ప్రధాని మోడీకి హాని కల్గించే విధంగా ప్రవర్తించిందన్నారు. పంజాబ్ లో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయన్నారు. కాంగ్రెస్ మోడీని అసహ్యించుకుంటుందని తెలుసు కానీ..ఇవాళ ఒక భారత ప్రధానిని దెబ్బతియడానికి ప్రయత్నించారన్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు.

 

పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ హుస్సేనీవాలాలోని అమరవీరుల స్మారకాన్ని వద్ద నివాళులర్పించేందుకు భఠిండాకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా స్మారకం వద్దకు చేరుకోవాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో బయలుదేరారు. ఈ మేరకు భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కేంద్ర హోం శాఖ అధికారులు పంజాబ్ డీజీపీకి ముందుగానే సమాచారం అందించారు. అయితే మార్గమధ్యంలో ప్రధాని కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్ వద్దకు చేరుకోగానే కొందరు నిరసనకారులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు కాన్వాయ్ను అడ్డుకోవడంతో ప్రధాని మోడీ దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్ పై చిక్కుకుపోయారని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.