V6 News

ఎల్ఐసీ కస్టమర్ల కోసం కొత్త యాప్

ఎల్ఐసీ కస్టమర్ల కోసం కొత్త యాప్

హైదరాబాద్​, వెలుగు: ఎల్​ఐసీ తన కస్టమర్ల కోసం ‘యాప్ మై ఎల్​ఐసీ’, సేల్స్ ప్రతినిధుల కోసం ‘సూపర్ సేల్స్ సాథీ’ యాప్​ను అందుబాటులోకి తెచ్చింది. పాలసీదారులు తమ బీమా వివరాలను ఒకే చోట చూసుకోవడానికి మై ఎల్‌ఐసీ యాప్​ఉపయోగపడుతుంది. మార్కెటింగ్ సిబ్బంది పనితీరు పెంచేలా సూపర్ సేల్స్ సాథీ యాప్ రూపొందించారు. 

ఏఐ టెక్నాలజీతో రూపొందిన ఈ యాప్​ల ద్వారా ప్రీమియం చెల్లింపులు, పాలసీ లోన్లు, ఈ–-కేవైసీ సేవలు వేగంగా పొందవచ్చు. కస్టమర్లు ఆఫీసులపై ఆధారపడటాన్ని తగ్గించడమే వీటి లక్ష్యమని కంపెనీ తెలిపింది.