అశ్వారావుపేట, మణుగూరు హాస్పిటళ్లలో బ్లాడ్ బ్యాంక్ లు

అశ్వారావుపేట, మణుగూరు హాస్పిటళ్లలో బ్లాడ్ బ్యాంక్ లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అశ్వారావుపేట, మణుగూరు ఏరియా గవర్నమెంట్​ హాస్పిటళ్లలో బ్లడ్​  బ్యాంక్​లకు అనుమతి వచ్చిందని డీసీహెచ్​ఎస్​ రవిబాబు మంగళవారం తెలిపారు. ఇప్పటి వరకు కేవలం కొత్తగూడెం, భద్రాచలం ఏరియా హాస్పటళ్లలో మాత్రమే బ్లడ్​ బ్యాంకులున్నాయని, ఇప్పుడు కొత్తగా వీటితో మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకూ బ్లడ్​ అందుబాటులో ఉండనుందని పేర్కొన్నారు.

 గర్భిణులు, సికిల్​ సెల్​, అనీమియా, తలసేమియాతో పాటు యాక్సిడెంట్స్, ఇతరత్రా అత్యవసర సమయాల్లో రక్తం అవసరం ఉంటుందని తెలిపారు