కొత్త పాస్ పోర్టును రిలీజ్ చేసిన బ్రిటన్

కొత్త పాస్ పోర్టును రిలీజ్ చేసిన బ్రిటన్

బ్రిటన్​ కొత్త పాస్​పోర్ట్​ను విడుదల చేసింది.యూరోపి యన్​ యూనియన్​ నుంచి బ్రిటన్​ విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  పాత పాస్​పోర్ట్​ ప్లేస్​లో కొత్త దానిని తీసుకొచ్చింది. పాత పాస్​పోర్ట్​ మెరూన్​(బర్గం డీ) కలర్​లో ఉండగా, ఈ కొత్త పాస్​పోర్ట్​ బ్లూ కలర్​లోఉంది. ఈ మేరకు కొత్త ‘బ్లూ ’ పాస్​పోర్ట్​ను ఆ దేశప్రధాని బోరిస్​ జాన్సన్​ విడుదల చేశారు. 30 ఏళ్లనిరీక్షణకు తెరదించారు. నిజానికి రెండేళ్ల క్రితమేఈ కొత్త బ్లూ పాస్​పోర్ట్​ను నాటి ఇమిగ్రేషన్​ మినిస్టర్​ బ్రాండన్​ లూయిస్​ ప్రకటించారు. అయితే,అప్పటికి ఈయూ నుంచి బ్రిటన్​ బయటకు రాకపోవడంతో అది కుదర్లేదు. ఇప్పుడు యూనియన్​ నుంచి బయటకు రావడంతో ఈ కొత్త పాస్​పోర్ట్​ను బోరిస్​ విడుదల చేశారు. వచ్చే నెల నుంచి ఈపాస్​పోర్ట్​లే అమల్లో ఉండబోతున్నాయి. నిజానికి1920 నుంచి 1988 వరకు బ్రిటన్​ పాస్​పోర్ట్​ బ్లూ కలర్​లోనే ఉండేది. కానీ, యూరోపి యన్​ యూనియన్​లో కలిశాక, దాని రంగు బర్గం డీలోకిమారిపోయింది. ‘‘ఈయూ నుంచి విడిపోవడం,మా జాతీయ ఐడెంటిటీ ని రీస్టోర్​ చేసేం దుకు ఉప-యోగపడుతోంది. కొత్త ప్రపంచంలోకి అడుగులువేస్తున్నాం . మళ్లీ బ్లూ , గోల్డెన్​ పాస్​పోర్ట్​లోకిరావడం మా జాతీయతను నిలబెట్టినట్టయింది’’అని బ్రిటన్​ హోం మంత్రి ప్రీతీ పటేల్​ అన్నారు.