కరోనా కష్టాలతో కొత్త బిజినెస్

కరోనా కష్టాలతో కొత్త బిజినెస్

స్టాఫ్ ను ఆదుకునేందుకు కొత్త బిజినెస్ 

కరోనా ప్రభావం ప్రైవేటు బస్ డ్రైవర్లు, కండక్టర్లు మీదా పడింది. కేరళలోని పాలక్కడ్ లో సజీవ్‌ థామస్ కు ఒక ట్రావెల్స్‌ ఉంది. ఈ యజమాని కూడా తనదగ్గర పనిచేసిన ఉద్యోగులకు ఏదైనా సాయం చెయ్యాలనుకున్నాడు. అలాగని ఫ్రీగా భోజనం పెట్టటమో, అవసరమైన సరుకులు ఇచ్చేసి చేతులు దులుపుకోవటమో చెయ్యలేదు. వాళ్లకి బతికే మార్గం చూపించాలనుకున్నాడు. అందుకే కొందరితో తన బస్సుల్లోనే కూరగాయల దుకాణాలు పెట్టించాడు. ఇంకొందరితో క్యాంటీన్ నడిపిస్తున్నాడు. థామస్‌‌‌‌ ట్రావెల్స్ లో18 బస్సులు నడిచేవి. లాక్‌ డౌన్‌‌‌‌లో బిజినెస్ పూర్తిగా దెబ్బతిం ది. బస్సులు షెడ్డులో ఉండిపోయాయి. అయితే థామస్‌‌‌‌కి అది మరీ భరించలేనంత నష్టం కాదు. కానీ, ఆ ట్రావెల్స్‌‌‌‌లో పని చేసే వాళ్లందరికీ బతుకుదెరువు పోయింది. కుటుంబాలు ఆకలితో అల్లాడే పరిస్థితి! అందుకే వాళ్లకోసం ఏదైనా చేయాలనుకున్నాడు.

‘కట్టన్స్’ పేరుతో ఓ హోటల్‌‌‌‌ తెరిచాడు. అందులో తన ట్రావెల్స్ సిబ్బందినే స్టాఫ్ గా తీసుకున్నాడు. వచ్చిన లాభాల్లో వాటా కూడా ఇస్తున్నాడు వాళ్లకు . లాక్‌ డౌన్‌‌‌‌ మొదలైనప్పుడు కూడా తన బస్సుల్లో మామిడిపండ్లు, కూరగాయలు పెట్టుకుని సేల్ చేయమని డ్రైవర్లకి ఇచ్చాడు. ఆ సీజన్‌‌‌‌ అయిపోయాక ఆ బస్సులనే మొబైల్ కిరాణా షాపులుగా నడుపుకొమ్మని చెప్పాడు. నేరుగా రైతుల నుంచి కూరగాయలను తెచ్చి అమ్మటంతో ఈ మొబైల్‌‌‌‌ దుకాణాలకు మంచి ఆదరణ లభించింది.

ఇప్పుడు ట్రావెల్స్ కన్నా ఈ బిజినెస్ లాభసాటిగా ఉందట ఆ డ్రైవర్లకి. ఇక క్లీనర్లు, మెకానిక్‌ లుగా పని చేసిన వాళ్ల కోసం ఒక హోటల్ స్టార్ట్ చేశాడు. ఈ హోటల్‌‌‌‌లో ఇంటీరియర్ కూడా క్రియేటివ్​గా చేయించాడు. పాత తరం మలయాళ సినిమా యాక్టర్ల క్యారికేచర్లను హోటల్ లో డిస్‌‌‌‌ప్లే చేస్తూ వాటికి కొన్ని క్యాప్షన్ లు యాడ్ చేసి కస్టమర్లని ఆకర్షిస్తున్నారు. డైనింగ్ టేబుల్స్‌‌‌‌ని కూడా సైకిళ్లలాగా డిజైన్ చేశారు. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంటీరియర్ డిజైనింగ్ థాట్స్. హోటల్‌‌‌‌ మొత్తం ఎకోఫ్రెండ్లీ సామాగ్రినే వాడుతున్నారు.

కోవిడ్, లాక్‌ డౌన్ లేకుంటే ఇలాంటి ఆలోచన వచ్చేది కాదేమో. ఆ క్రైసిస్ నుంచే నా వాళ్లకో సం ఏదైనా చేయాలన్న ఆలోచన పుట్టింది. ఇలా వాళ్లు నాకోసం పని చేసినందుకు కొం త రుణం తీర్చుకుంటున్నా. నా స్టాఫ్ కొంత మందికైనా ఉపాధి కల్పించానన్న తృప్తి ఉంది. –సజీవ్ థామస్.