యాదగిరిగుట్టకు ఇద్దరు కొత్త సీఐలు

యాదగిరిగుట్టకు ఇద్దరు కొత్త సీఐలు
  • రూరల్ సీఐగా శంకర్ గౌడ్, టౌన్ సీఐగా భాస్కర్ బాధ్యతల స్వీకరణ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్టకు కొత్తగా ఇద్దరు సీఐలు బుధవారం బాధ్యతలు చేపట్టారు. యాదగిరిగుట్ట రూరల్ సీఐగా మాదాసు శంకర్ గౌడ్, టౌన్ సీఐగా బొడ్డుపల్లి భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు.

 వీరిద్దరూ ఇప్పటివరకు పోస్టింగ్స్ కోసం రాచకొండ కమిషనరేట్ లో వెయిటింగ్ లో ఉండగా.. ఈనెల 3న జరిగిన బదిలీల్లో యాదగిరిగుట్ట రూరల్, టౌన్ పీఎస్ కు సీఐలుగా ట్రాన్స్​ఫర్ అయ్యారు. ఇప్పటివరకు యాదగిరిగుట్ట రూరల్ సీఐగా పనిచేసిన కొండల్ రావు ఆలేరు ఎస్ హెచ్ వో గా వెళ్లారు. టౌన్ సీఐగా విధులు నిర్వర్తించిన రమేశ్ భువనగిరి రూరల్ సీఐగా బదిలీ అయ్యారు.