వాట్సాప్ లో కొత్త ఫీచర్.. పిన్ చేసిన మెసేజ్ లు టాప్ లోకి

వాట్సాప్ లో కొత్త ఫీచర్.. పిన్ చేసిన మెసేజ్ లు టాప్ లోకి

వాట్సాప్ ఎప్పుడూ వినియోగదారుల అవసరాలకు కొత్త కొత్త అప్ డేట్స్ తీసుకొస్తుంటుంది. వినియోగదారులు ముఖ్యమైన మెసేజ్ లను పిన్ చేసుకోవడం కోసం ఇప్పుడు కొత్త అప్ డేట్ ని తీసుకొచ్చింది. చాటింగ్ లో ముఖ్యంగా గ్రూప్స్ చాటింగ్ లో ఇంపార్టెంట్ మెసేజ్ లు వస్తుంటాయి. అవి కావాలనుకుంటున్నప్పుడు వెతికితే దొరకవు. దాంతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు.

ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ పిన్ మెసేజ్ ఫీచర్ ని తీసుకు రాబోతోంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ ని త్వరలో.. ఆండ్రాయిడ్ 2.23.7.3 అప్ డేట్ తో అందుబాటులోకి తీసుకురానున్నారు. 

ఇప్పటివరకు ఈ ఫీచర్ టెలిగ్రామ్ లో ఉండేది. అయితే, ఆ ఫీచర్ ఇప్పుడు వాట్సాప్ లో అందుబాటులోకి రానుంది. పిన్ మెసేజ్ చేస్తే.. ఆ మెసేజ్ చాట్ స్క్రీన్ పై టాప్ లో కనిపిస్తుంది.