హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం నియామకం .. చైర్ పర్సన్ గా రాధిక అరుణ్ కుమార్

హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం నియామకం .. చైర్ పర్సన్ గా రాధిక అరుణ్ కుమార్
  • వైస్ చైర్ పర్సన్ గా స్రవంతి కిశోర్ రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు : హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా రాధిక అరుణ్ కుమార్ దేశ్ ముఖ్ (బూరుగడ్డ), వైస్ చైర్మన్ గా ఆదూరి స్రవంతి కిశోర్ రెడ్డి (మఠంపల్లి), కమిటీ సభ్యులుగా ముత్యాలంపాటి నాగులు మీరా, బాతుల సైదిరెడ్డి, తోడేటి శ్రీనివాసరావు, మొదాల వెంకన్న, లచ్చిమల్ల నాగేశ్వర్ రావు, గుజ్జుల కొండారెడ్డి, నట్టే జానకిరాములు, నందిపాటి కోటయ్య, భూక్యా రాయ్ సాయి, చెక్కర వెంకటరెడ్డి, మట్టపల్లి వెంకటనారాయణ, గుండా శ్రీనివాసరావును నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. 

నూతన మార్కెట్ కమిటీ నియామకంపై పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.