ఫిర్జాదిగూడలో కోచింగ్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ఫిర్జాదిగూడలో కోచింగ్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. ఫిర్జాదిగూడలో ప్రభుత్వ కోచింగ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సినిమాలు, క్రికెట్ చూడటం తగ్గించాలని,  ఫోన్ లో వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టాలను బంద్ చేసి చదువుపై దృష్టి సారించాలని అన్నారు. ఫోన్ ఎంత తక్కువ వాడితే అంత లాభం ఉంటుందన్న కేటీఆర్.. తల్లిదండ్రులను సంతోష పెట్టేలా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. 

ప్రస్తుత పోటీ ప్రపంచంలో  ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే బాగా కష్టపడాలని అన్నారు కేటీఆర్. టీ శాట్ ఛానల్లో చాలా కంటెంట్ ఉద్యోగార్థులు ఉందని దాన్ని వాడుకోవాలని సూచించారు. తెలంగాణలో చాలా పరిశ్రమలు ఉన్నాయని చాలా అవకాశాలు వస్తాయని చెప్పారు. ఎప్పటికప్పుడు నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేయాలన్న  కేటీఆర్.. టాస్క్ ఆధ్వర్యంలో పలువురికి ట్రైనింగ్ ఇస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

మార్చి 16 నుంచి పిల్లలు, వృద్ధులకు వ్యాక్సిన్

మోడీ మాస్కులకు ఫుల్ డిమాండ్