
దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతోంది. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇందులో మోస్ట్ ఫెరోషియస్ పాత్ర కోసం నాని మేకోవర్ అవుతున్నాడు. ‘దసరా’ చిత్రానికి పలు అవార్డులు రావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఏర్పడ్డాయి.
‘బిగ్‌బాస్’ ఫేమ్ అమర్ దీప్, లిషి గణేష్ కల్లపు జంటగా సాయి వర్మ దాట్ల దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం ‘నా నిరీక్షణ’. పి సంతోష్ రెడ్డి నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించగా, ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా, గణపతి రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. సురేష్ బాబు స్ర్కిప్ట్‌ను అందజేసి టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
దర్శకుడు వి సముద్ర తన వారసులు అరుణ్ మహా శివ, రామ్ త్రివిక్రమ్‌లను హీరోలుగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘దో కమీనే’. చంద్ర పులుగుజ్జు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో యాక్టర్స్ శ్రీకాంత్, సుమన్, దర్శకులు బి గోపాల్, ఎఎస్ రవికుమార్ అతిథులుగా పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి సుమన్ క్లాప్ నివ్వగా బి.గోపాల్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు, హీరో శ్రీకాంత్ స్క్రిప్ట్ అందించారు, నందమూరి మోహనకృష్ణ కెమెరా స్విచాన్ చేశారు.