ఉనికిచర్లలో సాండ్ బజార్ ప్రారంభం

ఉనికిచర్లలో సాండ్ బజార్ ప్రారంభం

ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండీసీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాండ్ బజార్ ను మంగళవారం స్టేషన్​ఘన్​పూర్,​ వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, టీజీఎండీసీ అధికారులతో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ర్ట ప్రభుత్వం సాండ్ బజార్ ను ఏర్పాటు చేసి, నాణ్యమైన ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. టీజీఎండీసీ పోర్టల్ లేదా మీసేవ కేంద్రాలు, ఆన్లైన్లో ఇసుకను బుకింగ్ అధికారులు చెప్పారు.  కార్యక్రమంలో టీజీఎండీసీ నోడల్ అధికారి శ్రీనివాస్, పీడీ హౌసింగ్ సిద్ధార్థ నాయక్, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి ప్రాజెక్ట్ అధికారులు విష్ణువర్ధన్, వినయ్, రాజు, తహసీల్దార్ సదానందం తదితరులు పాల్గొన్నారు.