టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో సీఎన్జీ వెర్షన్‌ను రూ.7.55 లక్షల ధరతో లాంచ్ చేసింది. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.10.55 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్ ధరలు). ఈ మోడల్ వాయిస్ -అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లతో వచ్చింది.
ఇది ఎక్స్ఈ, ఎక్స్ఎం+, ఎక్స్ఎం+(ఎస్), ఎక్స్జెడ్, ఎక్స్జెడ్+(ఎస్) ఎక్స్జెడ్+ఓ(ఎస్) వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ప్రొజెక్టర్ ల్యాంప్స్, డైమండ్ కట్ అలాయ్వీల్స్, టచ్స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి.
