‘డిఫెన్స్‌‌’లో  కొత్త టెక్నాలజీ

‘డిఫెన్స్‌‌’లో  కొత్త టెక్నాలజీ

లక్నోలో డిఫెన్స్‌‌ ఎక్స్‌‌పో ప్రారంభించిన మోడీ

లక్నో: డిఫెన్స్‌‌ రంగంలో ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజన్స్‌‌ను ఉపయోగించే దిశగా మన దేశం ఇప్పటికే రోడ్‌‌మ్యాప్‌‌ రూపొందించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తర్‌‌‌‌ప్రదేశ్‌‌లోని లక్నోలో బుధవారం నుంచి ఐదు రోజుల పాటు జరిగే ‘డిఫెన్స్‌‌ ఎక్స్‌‌పో–2020’ను ఆయన ప్రారంభించారు. టెక్నికల్‌‌ నాలెడ్జ్‌‌ దుర్వినియోగం, టెర్రరిజమ్‌‌, సైబర్‌‌‌‌ ముప్పు లాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు డిఫెన్స్‌‌ ఫోర్స్‌‌లు కొత్త టెక్నాలజీపై దృష్టి సారించాయని అన్నారు. “ రంగంలో ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ను ఉపయోగించేందుకు రోడ్‌‌మ్యాప్‌‌ను సిద్ధం చేశాం. ఆ దిశగా చాలా ప్రోటోటైప్‌‌లను ప్రవేశపెడుతున్నాం. వచ్చే ఐదేశ్లలో ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌కు సంబంధించి 25 ప్రాడక్ట్స్‌‌ను డెవలప్‌‌ చేయాలనుకుంటున్నాం” అని మోడీ అన్నారు. ఏ దేశాన్ని టార్గెట్‌‌ చేసుకోవడానికి తాము డిఫెన్స్‌‌ పరంగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రపంచ శాంతికి తాము సహకరిస్తామని మోడీ చెప్పారు. పొరుగు దేశాల సెక్యూరిటీ కూడా తమ బాధ్యత అని చెప్పారు.

కొత్త టెక్నాలజీలను తీసుకొచ్చేందుకే

డిఫెన్స్‌‌లోకి కొత్త టెక్నాలజీలను తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ డిఫెన్స్‌‌ ఎక్స్‌‌పోను జరుపుతారు. యూపీలోని లక్నోలో ప్రారంభమైన ఈ డిఫెన్స్‌‌ ఎక్స్‌‌పో 11వ ఎడిషన్‌‌. ఈ నెల 9 వరకు ఇది జరగనుంది. మన దేశంతో పాటు విదేశాలకు చెందిన తయారీ సంస్థలు డిఫెన్స్‌‌ ప్రాడక్ట్స్‌‌ను ఈ ఎక్స్‌‌పోలో ప్రదర్శిస్తాయి.  ‘ఇండియా: ది ఎమర్జింగ్‌‌ డిఫెన్స్‌‌ మాన్యుఫ్యాక్చరింగ్‌‌ హబ్‌‌’,  ‘డిజిటల్‌‌ ట్రాన్స్‌‌ఫర్మేషన్‌‌ ఆఫ్‌‌ డిఫెన్స్‌‌’ థీమ్‌‌తో దీన్ని ఏర్పాటు చేశారు.

ఎక్స్‌‌పోలో మన మిథానీ

ఐదు రోజులు జరిగే ఈ ఎక్స్‌‌పోలో హైదరాబాద్​ మిథానీతో పాటు 1028 కంపెనీలు పాల్గొంటున్నాయి. మిథానీ స్టాల్​లో పలు ప్రొడక్ట్స్​ను ప్రదర్శిస్తోంది.  38 దేశాలకు చెందిన డిఫెన్స్‌‌ మినిస్టర్స్‌‌, సర్వీస్‌‌ చీఫ్స్‌‌ ఈ ఎక్స్‌‌పోలో పాల్గొంటారు. ఆయా దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం కూడా ఉంది.